Tragedy | దవాఖానలో బెడ్స్ ఖాళీ లేక బీజేపీ మాజీ ఎంపీ కొడుకు మృతి
Tragedy | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఎమర్జెన్సీ బెడ్ ఖాళీ లేక బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు దవాఖానకు వచ్చిన గంటసేపటికే మరణించాడు. లక్నోలోని సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Tragedy | న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఎమర్జెన్సీ బెడ్ ఖాళీ లేక బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు దవాఖానకు వచ్చిన గంటసేపటికే మరణించాడు. లక్నోలోని సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బండా నియోజకవర్గ మాజీ బీజేపీ ఎంపీ భైరాన్ ప్రసాద్ మిశ్రా తన కొడుకు ప్రసాద్ మిశ్రాను గత శనివారం రాత్రి దవాఖానకు తీసుకొచ్చారు.అయితే ఎమర్జెన్సీ బెడ్స్ ఖాళీ లేవని డ్యూటీ అధికారి చెప్పారు.
ఆ తర్వాత గంటసేపటికే ప్రకాశ్ మిశ్రా మరణించారు. దీనిపై ఆగ్రహించిన ప్రసాద్ మిశ్రా రాత్రంతా దవాఖానలో ధర్నా చేశారు. ప్రసాద్ మిశ్రా మరణంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. ‘యూపీలో అధికార బీజేపీ మాజీ ఎంపీ కొడుక్కే చికిత్స లభించకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల ప్రచారం చేసొచ్చిన తర్వాత మంత్రి దీనిపై స్పందిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వారికి ఎవరి ప్రాణాల కన్నా ఎన్నికలే ముఖ్యం’ అని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

