Jagannath Rath Yatra | పూరికి పోటెత్తిన విదేశీ భక్తులు
Jagannath Rath Yatra : జగన్నాథుడి రథయాత్ర (Rath Yatra) సందర్భంగా ఒడిశాలోని పూరి (Puri) క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది.
Jagannath Rath Yatra : జగన్నాథుడి రథయాత్ర (Rath Yatra) సందర్భంగా ఒడిశాలోని పూరి (Puri) క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదివారం ఆరంభమైన రథయాత్ర ఇవాళ రెండోరోజూ కొనసాగుతున్నది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో రెండు రోజులపాటు రథయాత్ర జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ యాత్రను రెండు రోజుల పాటు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్నాధ రథయాత్రతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక రష్యా నుంచి భారీ సంఖ్యలో భక్తులు పూరికి పోటెత్తారు. రథయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రష్యా భక్తురాలు మీడియాతో మాట్లాడుతూ జగన్నాధ రథయాత్రలో పాల్గొనేందుకు తాము పలుమార్లు రష్యా నుంచి ఇక్కడకు వచ్చామని చెప్పుకొచ్చారు. జగన్నాధుడు కొలువుతీరిన ఈ పవిత్ర ప్రదేశానికి రావడం తమకు సంతోషంగా ఉందని అన్నారు.
ఇక రష్యాలో స్ధిరపడిన మరో భక్తురాలు హరిప్రియ మాట్లాడుతూ రథయాత్రలో పాల్గొనడం సంతోషకరమని, తాను ఇక్కడకు రావడం ఇది పదవసారని చెప్పారు. పూరి జగన్నాధుడి పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆమె తెలిపారు. కాగా, తొలి రోజు రథయాత్రలో అపశ్రుతి చోటచేసుకుంది. రథం లాగుతుండగా భక్తుల మధ్య జరిగిన స్వల్ప తోపులాటలో ఒకరు మరణించగా.. 300 మంది స్వ ల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే దవాఖానలకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చే చెరాపహరా కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత బలభద్రుని తాళ ధ్వజ రథాన్ని ముందుకు నడిపిస్తుండగా జరిగిన తోపులాటలో ఒక భక్తుడు మరణించాడు.
Read More :
Alcohol Party | బీజేపీ ఎంపీ విజయోత్సవ సభలో మద్యం పంపిణీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

