విశాఖలో నౌకాదళ ఉత్సవాలు.. దేశ రాజధాని వెలుపల తొలిసారి
Navy Day celebrations | ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ నౌకాదళ ఉత్సవాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్నది. దీంతో ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నేవీ డే
న్యూఢిల్లీ: ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ నౌకాదళ ఉత్సవాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్నది. దీంతో ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నేవీ డే వేడుకలు జరుగడం ఇదే మొదటిసారి. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుంగా ఏటా డిసెంబర్ 4 నేవీ డేగా నిర్వహిస్తున్నది. ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో త్రివిధ దళాధిపతి అయిన భారత రాష్ట్రపతి సమక్షంలో వేడులను నిర్వహిస్తారు.

అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పాక్‌పై విజయంలో కీలకపాత్ర పోషించిన తూర్పు నావికా దళానికి కేంద్రమైన విశాఖలో ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, సైనిక ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

1971 డిసెంబర్ 4 న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత నావికాదళం పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపైన మెరుపుదాడి చేసింది. నాలుగు యుద్ధ నౌకలను ధ్వంసం చేసి, బంగాళాఖాతంలో ప్రాదేశిక ప్రాంతాలను నేవీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు భారత వైమానిక దళం దాదాపు 4000 యుద్ధ వాహనాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌ను కలావికలం చేసింది. భారత సైన్యం ముందు పాక్ ఎత్తులు నిలవలేక 15 రోజుల్లోనే డిసెంబర్ 16 న పూర్తిగా భారత దళాలకు లొంగిపోయింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు. ఏటా ఈ రోజునే నేవీ డేగా దేశంలోని నావికాదళ కమాండ్స్ నిర్వహిస్తున్నాయి. రక్షణ దళంలోని త్రివిధ దళాలు అత్యంత ఘనకీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

