Supreme Court: మాజీ ఐపీఎస్‌కు 3 లక్షల జరిమానా విధించిన సుప్రీంకోర్టు
Sanjiv Bhatt: పదేపదే పిటీషన్లు దాఖలు చేస్తున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌కు మూడు లక్షల జరిమానా విధించింది సుప్రీంకోర్టు. జస్టిస్ విక్రమ్‌నాథ్, రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.
న్యూఢిల్లీ: మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌కు సుప్రీంకోర్టు(Supreme Court) మూడు లక్షల జరిమానా విధించింది. ఓ డ్రగ్స్ కేసులో పదే పదే పిటీషన్లను దాఖలు చేస్తున్నందుకు అతనికి ఆ ఫైన్ వేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సంజీవ్ భట్ ఇటీవల వరుసగా మూడు సార్లు కోర్టులో అభ్యర్థనలను దాఖలు చేశారని, ఒక్కొక్క దానికి లక్ష చొప్పున, అతనికి మూడు లక్షల ఫైన్ వేశారు. సుప్రీంకోర్టుకు ఎన్ని సార్లు వచ్చావని, కనీసం ఓ డజన్ సార్లు వచ్చావా అని జస్టిస్ విక్రమ్‌నాథ్ ప్రశ్నించారు. గుజరాత్ హైకోర్టు అడ్వకేట్ల సంఘం వద్ద ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
1996లో రాజస్థాన్‌కు చెందిన ఓ లాయర్‌ను బసన్కాంతా పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ లో అడ్వకేట్ రూమ్ నుంచి డ్రగ్స్ సీజ్ చేశారు. ఆ సమయంలో బసన్కాంతా ఎస్పీగా భట్ ఉన్నారు. ఆ లాయర్‌పై తప్పుడు కేసును బనాయించినట్లు రాజస్థాన్ పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసులో భట్‌ను 2018 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను జైలులోనే ఉన్నాడు. ప్రధాని మోదీని విమర్శిస్తున్నారన్న నేపథ్యంలోనే భట్‌ను ఇరికించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

