Uber driver attacks woman | పొరపాటున మరో క్యాబ్ ఎక్కిన మహిళ.. దాడి చేసిన ఉబర్ డ్రైవర్
Uber driver attacks woman | ఒక మహిళ బుక్ చేసిన క్యాబ్‌కు బదులు పొరపాటున మరో క్యాబ్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆ మహిళతోపాటు ఆమె కుమారుడిపై దాడి చేశాడు (Uber driver attacks woman). ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఒక మహిళ బుక్ చేసిన క్యాబ్‌కు బదులు పొరపాటున మరో క్యాబ్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆ మహిళతోపాటు ఆమె కుమారుడిపై దాడి చేశాడు (Uber driver attacks woman). ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం భోగనహళ్లి ప్రాంతానికి చెందిన 48 ఏండ్ల మహిళ తన కుమారుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసింది. వారి ఇంటి వద్దకు ఒక క్యాబ్ వచ్చింది. బుక్ చేసుకున్న క్యాబ్‌గా భావించిన ఆ మహిళ తన కుమారుడితో కలిసి అందులోకి ఎక్కింది. అయితే బుక్ చేసిన క్యాబ్ అది కాదని ఆమె తెలుసుకున్నది.
కాగా, కుమారుడు ముందుగా కారు దిగాడు. ఆ తర్వాత ఆ మహిళ కూడా కారు దిగేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆ మహిళతో ఘర్షణకు దిగాడు. అంతేగాక ఆమెను పలుసార్లు కొట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కుమారుడిపైనా దాడి చేశాడు.
మరోవైపు స్థానికులు, పొరుగువారు వెంటనే స్పందించారు. ఉబర్ క్యాబ్ డ్రైవర్ దాడిని అడ్డుకున్నారు. కారులో పారిపోయేందుకు ప్రయత్నించిన అతడ్ని మెయిన్ గేటు వద్ద నిలువరించారు. మహిళ భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో 25 ఏండ్ల ఉబర్ క్యాబ్ డ్రైవర్ బసవరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఆ మహిళ తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిందని క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు. మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

