జెరుసలాం: ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్(Smit Machchhar)ను.. ఇజ్రాయిలీ సర్కారు సత్కరించనున్నది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన మచ్చర్‌కు ప్రెసిడెన్షియల్ అవార్డును అందజేయనున్నది. దుబాయ్ నుంచి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ కాకుండా మచ్చర్ అడ్డుకున్నారని ఇజ్రాయిలీ అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రెస్ ఆఫీసు ప్రకారం.. ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణించిన ఆరుగురు ప్రయాణికులకు గురువారం దేశాధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్ హీరోయిజం మెడల్‌ను అందజేశారు. కోపైలట్‌ను నిర్బంధించడంలో ఆ ప్రయాణికులు సహకరించారు.
అవార్డు అందుకున్నవారిని ఉద్దేశిస్తూ ఇజాక్ మాట్లాడుతూ.. ఇజ్రాయిలీ హీరోలను గౌరవిస్తున్నామని, కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మచ్చర్ చూపిన తెగువ, సాహసం వల్ల పెను విషాదం తప్పిందన్నారు. స్మిత్ మచ్చర్ కోలుకున్న తర్వాత .. అతనికి ప్రెసిడెన్షియల్ అవార్డును అందజేయనున్నట్లు చెప్పారు. తాలి మనేస్, జీవికా మేన్స్, యానివ్ హయూన్, డాక్టర్ షోటా ముసయేవ్, అసఫ్ రాజ్వాన్, పర్దిలోవ్కు ప్రెసిడెన్షియల్ అవార్డు అందజేశారు.