అహ్మదాబాద్: గుజరాత్(Gujarat Floods)లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాజ్కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షాల వల్ల .. వరద లాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. అనేక పట్టణాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న సూత్రపత తాలూకాలో 345 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక వర్షం కురిసిన ప్రాంతం.
गुजरात के राजकोट जिले के धोराजी में 6 घंटे में 9.5 इंच बारिश पूरा शहर हुआ पानी पानी
अगले 24 घंटे भी दक्षिण गुजरात और सौराष्ट्र के कई जिलों में भारी बारिश की चेतावनी @indiatvnews pic.twitter.com/xBUORgi0Ps
— Nirnay Kapoor (@nirnaykapoor) July 18, 2023
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పలు చోట్ల కురిసే ఛాన్సు ఉన్నట్లు ఐఎండీ ఇవాళ తెలిపింది. మరికొన్ని రోజుల పాటు సౌరాష్ట్రతో పాటు దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో ఆ వర్షాలు కురవనున్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
రాజ్కోట్ జిల్లాలోని దొరాజి తాలూకాలో 250 ఎంఎం వర్షం కురిసింది. సూరత్ కూడా వర్షం దెబ్బకు అతలాకుతలమైంది. అక్కడ 104 ఎంఎం వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జునాగడ్ జిల్లాలో కూడా పలు చోట్ల గట్టి వర్షమే పడింది.
गुजरात
पिछले 24 घंटों में गुजरात जे 176 तहसीलों में बारिश
पिछले 24 घंटों में गिर-सोमनाथ जिले में सबसे ज्यादा बारिश
गिर-सोमनाथ के
सुतरपाड़ा में 22 इंच
वेरावल में 20 इंच
तलाला में 12 इंच
कोडिनार में 9 इंचगिर-सोमनाथ जिले में हिरण, प्राची और सरस्वती नदियां उफान पर है… pic.twitter.com/JUkMoV4nkI
— Nirnay Kapoor (@nirnaykapoor) July 19, 2023
అమ్రేలీ, వల్సాద్, భావనగర్ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తుందని ఐఎండీ శాఖ హెచ్చరించింది. గుజరాత్లో మొత్తం 206 రిజర్వాయర్లు ఉన్నాయి, దాంట్లో 43 వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే 18 రిజర్వాయర్లు అలర్ట్ మోడ్లో ఉన్నాయని, 19కి వార్నింగ్ ఇచ్చామని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
విస్తారంగా వర్షాలు కురవడం వల్ల ఖరీఫ్ పంట కోసం నాట్లు ప్రారంభం అయ్యాయి. సాగు విస్తీర్ణం 71 శాతం నేలల్లో జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. ఈ ఏడాది రుతుపవనాల వల్ల రాష్ట్రంలో 56 శాతం వర్షం కురిసినట్లు ఆ రాష్ట సర్కార్ పేర్కొన్నది.