జమ్ముకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా, సురంకోట్ తహసీల్‌లోని బుఫ్లియాజ్, లోయర్ ముర్రా ప్రాంతంలో ఆదివారం భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.
- పన్నెండు మంది మృతి
పూంచ్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా, సురంకోట్ తహసీల్‌లోని బుఫ్లియాజ్, లోయర్ ముర్రా ప్రాంతంలో ఆదివారం భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వివిధ ఘటనల్లో పన్నెండు మంది మృతి చెందగా పలువురు గల్లంత య్యారు.పోలీసులు, సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఆర్డీఎఫ్, ఆర్మీ, స్థానిక స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరదలకు పూంచ్ జిల్లా భారీగా దెబ్బ తిన్నది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మొబైల్ నెట్వర్క్ సేవలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని, జమ్ముకు తిరిగి బయలుదేరారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలతో మాట్లాడి, వరద ప్రభావిత జిల్లాలోని పరిస్థితులను అంచనా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

