Encounter | కుల్గామ్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారని ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా వెళ్లడించింది. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని పేర్కొంది. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించింది.
కాగా, ఈ నెల ఆరంభంలో శ్రీనగర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది చనిపోయాడు. అతడు గగన్‌గిర్, గందేర్బల్ ప్రాంతాల్లో సాధారణ పౌరులను హత్యలతోపాటు పలు ఉగ్ర దాడుల్లో పాల్గొన్నాడని అధికారులు వెల్లడించారు.
OP KADER, Kulgam
On 19 Dec 24, based on specific intelligence input regarding presence of terrorists, a Joint Operation launched by #IndianArmy & @JmuKmrPolice at Kader, Kulgam. Suspicious activity was observed by vigilant troops and on being challenged, terrorists opened… pic.twitter.com/9IxVKtDZkl
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) December 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

