ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ తెలుగు నటిపై ఫిట్నెస్ ట్రైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. టాలీవుడ్‌కు చెందిన ఓ నటిని ఆదిత్య కపూర్ అనే ఫిట్నెస్ ట్రైనర్ పెండ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అనంతరం ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. పెండ్లి ఎప్పుడు చేసుకుంటావని ఆమె అడగటంతో వేధింపులు మొదలు పెట్టాడు. కొన్ని ప్రైవేటు ఫొటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడతానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమెపై భౌతికదాడి కూడా చేశాడు. దీంతో ఆమె కూఫీ పరేడ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆదిత్య కపూర్ పలుమార్లు లైంగికదాడి చేశాడని, అనంతరం వివాహానికి నిరాకరించడాని అందులో పేర్కొన్నది. పెండ్లి చేసుకోవాలని అడగడంతో తనను దూషించి కొట్టాడని వెల్లడించింది. తన ప్రైవేట్ ఫొటోలు అతని వద్ద ఉన్నాయని వాటిని బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింది కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు 2016 నుంచి తెలుగు చిత్రసీమలో కొనసాగుతున్నది.