Patanjali | శాకాహార ఉత్పత్తిలో చేప ఆనవాళ్లు..? మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో రామ్‌దేవ్‌బాబా
Patanjali | యోగా గురు రామ్‌దేవ్ బాబా (Baba Ramdev) నేతృత్వంలోని ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి (Patanjali) మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడింది.
Patanjali | యోగా గురు రామ్‌దేవ్ బాబా (Baba Ramdev) నేతృత్వంలోని ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి (Patanjali) మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడింది. శాకాహారంగా (vegetarian product) విక్రయించబడుతున్న ఆ కంపెనీకి చెందిన దంత సంరక్షణ ఉత్పత్తి అయిన ‘దివ్య మంజన్’ (Divya Manjan)లో మాంసాహార పదార్థాలు ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది యతిన్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అధికారిక వెబ్సైట్లో గ్రీన్ డాట్‌తో సంస్థ తన ఉత్పత్తిని విక్రయిస్తోందని, ఇది శాకాహారి అని సూచిస్తుందని తెలిపారు. అయితే, లోపల ఉన్న ఇన్‌గ్రీడియెంట్స్‌తో చూస్తే ఇది విరుద్దంగా ఉందంటూ పేర్కొన్నారు. ఆ ప్రొడక్ట్‌లో సముద్రఫెన్ అనే చేపలకు సంబంధించిన మూలాలను వాడినట్లు ఇటీవలే జరిపిన పరిశోధనల్లో వెల్లడైందని తన పిటిషన్లో వివరించారు. అలాంటప్పుడు ‘దివ్య మంజన్’ను శాకాహార ఉత్పత్తిగా ఎలా బ్రాండింగ్ చేస్తారని సదరు పిటిషనర్ ప్రశ్నించారు.
మతవిశ్వాసాల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు శాకాహారం మాత్రమే తింటామని.. ‘దివ్య మంజన్’లో చేప మూలాలు ఉన్నాయని తెలిసి చాలా కలత చెందామని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.
Also Read..
Helicopter Missing | 22 మందితో వెళ్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
PM Modi | మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆందోళనకరం.. ఈ కేసుల్లో సత్వర న్యాయం జరగాలి : ప్రధాని మోదీ
Pune | వడపావ్ తినేందుకు స్కూటీ ఆపి.. రూ.5లక్షల విలువైన నగలు పోగొట్టుకున్న వృద్ధ జంట
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

