Cancer | క్యాన్సర్ రోగులక్ గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి వ్యాక్సిన్!
క్యాన్సర్‌ను నయం చేసే వ్యాక్సిన్‌ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించిన మెసెంజర్ ఆర్ఎన్ఏ(mRNA) సాంకేతికతనే ఇందులోనూ వినియోగించారు.
- బ్రిటన్‌లో రోగులపై క్లినికల్ ట్రయల్స్
Cancer | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): క్యాన్సర్‌ను నయం చేసే వ్యాక్సిన్‌ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించిన మెసెంజర్ ఆర్ఎన్ఏ(mRNA) సాంకేతికతనే ఇందులోనూ వినియోగించారు. గ్లోబల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లో క్యాన్సర్ రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి మంచి ఫలితాలను సాధించినట్టు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇతర ఘన కణితుల క్యాన్సర్లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితను అధ్యయనం చేస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఎంఆర్ఎన్ఎ-4359 పేరుతో పిలవబడే ఈ టీకాను చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ 81 ఏండ్ల వ్యక్తికి ఇవ్వగా.. సత్ఫలితాలు వచ్చినట్టు ప్రకటించారు. ఈ ప్రయోగ ఫలితాలు, భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పును తీసుకురాబోతున్నట్లు పరిశోధకులు ప్రకటించారు. ఈ కొత్త టీకా క్యాన్సర్ రోగి శరీరంలోని సొంత రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరచడం వల్ల రక్షణ వ్యవస్థ మరింత బాగా పని చేస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

