సింగ్రౌలీ: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారు(BJP MLA Car)ను.. ఫైరింజిన్ నీటితో శుభ్రం చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. అగ్నిప్రమాద సమయంలో ఎమర్జెన్సీ కోసం వినియోగించే ఫైరింజిన్ నీటితో… కారును క్లీన్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ రెసిడెన్స్ ఆవరణలో టొయోటా ఇన్నోవా కారును క్లీన్ చేశారు. అయితే తనకు తెలియకుండానే కారును శుభ్రం చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కానీ విపక్షాలు మాత్రం ఆ ఫూటేజీ పట్ల ప్రశ్నలు లేవనెత్తారు. పర్సనల్ వాహనం కోసం ప్రభుత్వ వనరులను వాడుకుంటున్నట్లు ఆరోపించారు.
ఫైరింజిన్లో ఉండే నీటి పంపుతో.. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు కారును కడుగుతున్న వీడియో మంగళవారం వైరల్ అయ్యింది. ఈ ఘటన పట్ల తనకు సమాచారం లేదని సింగ్రౌలీ మున్సిపల్ కమీషనర్ సవితా ప్రధాన్ తెలిపారు. అవసరమైన సమయంలో అగ్నిప్రమాదం జరిగిన చోటుకు ఫైరింజిన్లు చేరుకోలేవని, కానీ సింగ్రౌలీలో మాత్రం అగ్నిమాపక సిబ్బందిని ప్రైవేటు కారు వాషింగ్ సెంటర్‌గా మార్చుకున్నట్లు విపక్ష నేత ఉమాంగ్ సింఘార్ ఆరోపించారు.
Fire brigade was called to wash car of MLA in MP. 🤯
Yahan logu ko peene ke liye paani nhi hai aur inn logu ka VIP culture alag hi chal raha hai. 🤡 pic.twitter.com/W1rX6i3rrT
— Desi Lord (@DesiLord_) August 26, 2026