Emergency Landing | వృద్ధురాలి మృతి.. వారణాసిలో స్పైస్జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..
Emergency Landing | దర్భంగా నుంచి ముంబయి వెళ్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ఆరోగ్యం పరిస్థితి విషమించింది. పైలట్ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దింపారు.
Emergency Landing | దర్భంగా నుంచి ముంబయి వెళ్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ఆరోగ్యం పరిస్థితి విషమించింది. పైలట్ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దింపారు. ఆ తర్వాత మహిళను వెంటనే ఆసుప్రతికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వృద్ధురాలు కళావతి దేవి (85) తన మనవడితో కలిసి ముంబయికి వెళ్తున్నది. దర్భంగా విమానాశ్రయం నుంచి ముంబయికి ఎస్జీ 116 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలు ఆరోగ్యం క్షీణించింది.
దీంతో సిబ్బంది ఏటీసీని సంప్రదించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరారు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో ల్యాండింగ్ తర్వాత వృద్ధురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినప్పటికీ వృద్ధురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా విమానం ఒకటిన్నర గంట ఆలస్యంగా ముంబయి విమానాశ్రయానికి చేరుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

