పార్లమెంట్ బయట నిరసన చేస్తాం: సంయుక్త కిసాన్ మోర్చా

న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ బయట నిరసన చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం ప్రకటించింది. ఒక్కో రైతు సంఘం నుంచి ఐదుగురు చొప్పున 40 రైతు సంఘాల తరుఫున సుమారు 200 మంది రైతులు ప్రతి రోజు పార్లమెంట్ బయట నిరసనలో పాల్గొంటారని రైతు నాయకుడు గుర్నమ్ సింగ్ చారుణి తెలిపారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రతి రోజు సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు సభలో విపక్షాలు పోరాడితే పార్లమెంట్ బయట తాము నిరసన తెలుపుతామని అన్నారు. సభ నుంచి వాకౌట్ చేయవద్దని ప్రభుత్వం సమస్యను పరిష్కరించే వరకు సభను సాగనీయవద్దని ప్రతిపక్ష ఎంపీలను కోరారు. 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రెండు రోజులు ముందుగా, ఈ నెల 17న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు దీని గురించి లేఖ రాయనున్నట్లు చెప్పారు.
మరోవైపు భారీగా పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలపై ఈ నెల 8న దేశవ్యాప్త నిరసనకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. గురువారం రోజు ప్రజలంతా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తమ వాహనాలను జాతీయ, రాష్ట్ర రహదారులపై నిలిపి నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

