Farmers Fly Kites To Tackle Drones | డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం.. గాలిపటాలతో చెక్ పెడుతున్న రైతులు
Farmers Fly Kites To Tackle Drones | రైతుల ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలతో వాటికి చెక్ పెడుతున్నారు. గాలిపటాలు ఎగురవేసి డ్రోన్లను అడ్డుకుంటున్నారు.
న్యూఢిల్లీ: రైతుల ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలతో వాటికి చెక్ పెడుతున్నారు. గాలిపటాలు ఎగురవేసి డ్రోన్లను అడ్డుకుంటున్నారు. (Farmers Fly Kites) గాలిపటాల దారాలు డ్రోన్లకు చుట్టుకోవడంతో కొన్ని కూలిపోయాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రైతులను చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. టియర్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్స్‌తో దుస్తులు తడిగా ఉంచుకుంటున్నారు. అలాగే టియర్ గ్యాస్ ప్రభావం నుంచి రక్షణ కల్పించే దుస్తులు ధరిస్తున్నారు. కనీస మద్దతు ధర ( ఎంఎస్పీ) , వ్యవసాయ సంస్కరణలకు చట్టపరమైన హామీతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి ఢిల్లీ బాటపట్టారు.
#FARMERS FLY KITES TO BLOCK POLICE DRONES#FarmersProtest #FarmersProtest2 pic.twitter.com/DG9ZW80VsK
— azad (@klmfasihi) February 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

