ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు
యువతి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రేమ వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు.
ముంబై: ప్రేమ వ్యవహారాన్ని సహించని కుటుంబ సభ్యులు ఒక యువతిని హత్య చేశారు. మృతదేహాన్ని తగులబెట్టి అవశేషాలను కాలువలో పడేశారు. సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లింబగో పోలీస్ స్టేషన్ పరిధిలోని పింప్రి మహిపాల్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి బీహెచ్ఎంఎస్ మూడో ఏడాది చదువుతున్నది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఆమె ప్రేమించింది.
కాగా, కుటుంబ సభ్యులు ఆ యువతికి పెళ్లి సంబంధం చూశారు. ఒక వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు. అయితే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని తాను ప్రేమిస్తున్నట్లు అతడితో ఆమె చెప్పింది. దీంతో ఆ వ్యక్తితో పెళ్లి రద్దు అయ్యింది. ఈ సంఘటనపై యువతి కుటుంబ సభ్యులు చాలా అసంతృప్తి చెందారు. యువతి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబ సభ్యలు కలిసి ఈ నెల 22న రాత్రి వేళ ఆమెను పొలం వద్దకు తీసుకెళ్లారు. తాడుతో గొంతు నొక్కి హత్య చేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని దహనం చేశారు. ఆపై అవశేషాలను కాలువలో పడేశారు.
మరోవైపు యువతి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రేమ వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ నేపథ్యంలో యువతి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులను శుక్రవారం అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

