Manipur Incident | మణిపూర్ దారుణ ఘటన.. అసలు ఆ రోజు ఏం జరిగింది ?
Manipur Incident | ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో గత రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజాగా వెలుగుచూసిన దారుణ ఘటన ఉద్రిక్తతలను మరింత రాజేసింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యావత్ దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది.
Manipur Incident | ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో గత రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజాగా వెలుగుచూసిన దారుణ ఘటన ఉద్రిక్తతలను మరింత రాజేసింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యావత్ దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఈ అమానుష ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మే 4న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. జూలై 19న సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. మే 3 నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్పై నిషేధం అమలులో ఉండటంతో.. ఇన్ని రోజులూ ఈ వీడియో బయటకు రాలేదని సమాచారం. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో.. డబుల్ ఇంజిన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయో యావత్ దేశానికి తెలిసొచ్చింది.
అసలు ఆ రోజు ఏం జరిగింది?
మణిపూర్‌లో లోయ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన మీతీలకు, పర్వత ప్రాంతాల్లో ప్రాబల్యం కుకీలకు మధ్య మే 3న ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమకు ఎస్టీ హోదా కల్పించాలని మీతీలు డిమాండ్ చేయడం వివాదానికి దారి తీసింది. పర్వత ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించడంతో అల్లర్లు చెలరేగాయి. తమ వర్గానికి చెందిన మహిళలపై లైంగికదాడులకు పాల్పడ్డారన్న వదంతులు వ్యాపించడంతో ఓ వర్గం వారు మరో వర్గం వారిపై దాడులకు దిగారు. ఈ క్రమంలో మే 4న బీ.ఫయనోమ్ గ్రామానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 56 ఏండ్ల వ్యక్తి, అతడి కుమారుడు(19) , కుమార్తె (21) ఓ కుటుంబానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. అడవిలోకి వెళ్తుండగా వీరికి నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసుల బృందం కనిపించింది. పోలీస్ స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో, 800-1000 మందితో కూడిన భారీ గుంపు వీరిని అడ్డగించింది. పోలీసుల నుంచి ఈ ఐదుగురి బృందాన్ని అపహరించి దాడికి దిగింది. మూక నుంచి తన సోదరిని రక్షించే క్రమంలో యువకుడితోపాటు అతడి తండ్రి ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం, ఆ గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ పంట పొలాల్లోకి తీసుకెళ్లింది. ఈ క్రమంలో కొందరు యువకులు ఆ యువతులను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా వ్యవహరించారు. ఓ యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు బాధిత కుటుంబం పోలీసులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ మేరకు మే 18న జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం మే 21న నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి హెరాదాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే మే నెలలోనే ఈ అమానుష ఘటన జరిగినప్పటికీ, రెండు నెలలు గడిచినా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

