కర్ణాటకలో వెలుగులోకి నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ ఉదంతం.. నలుగురి అరెస్ట్
Fake RT-PCR report | కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తికి నకిలీ సర్టిఫికెట్ జారీ

బెంగళూరు : కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తికి నకిలీ సర్టిఫికెట్ జారీ చేయడంతో అతను దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కర్ణాటక పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సహా ఓ ప్రైవేట్ ల్యాబ్‌లోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ వ్యక్తులు దక్షిణాఫ్రికా పౌరులకు నకిలీ ఆర్టీ పీసీఆర్ రిపోర్ట్ అందించారని ఆరోపిస్తున్నారు. భారత్‌లో తొలి ఒమిక్రాన్ కేసు బాధితుడు విదేశీయుడు కాగా.. నవంబర్ 20న దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చాడు. విమానాశ్రయంలో అతనికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
ఆ తర్వాత పౌరుడిని ఓ హోటల్లో క్వారంటైన్ చేశారు. సదరు వ్యక్తి తర్వాత నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ చూపించి.. దుబాయి మీదుగా దక్షిణాఫ్రికా పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు సర్టిఫికెట్‌ను తయారు చేసిన ల్యాబ్‌ను ప్రశ్నించగా.. మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి 24 కాంటాక్టులను గుర్తించి వారికి కొవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్‌గా వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

