వివాహేతర సంబంధం పెట్టుకున్నా.. ఆ తల్లి చెడ్డది కాదు

చంఢీఘడ్ : వివాహేతర సంబంధం పెట్టుకున్నంత మాత్రాన.. ఓ మహిళను చెడిన తల్లిగా చిత్రీకరించలేమని పంజాబ్-హర్యానా హైకోర్టు ఓ తీర్పులో పేర్కొన్నది. నాలుగేళ్ల బాలిక కస్టడీని తల్లికి అప్పగించాలంటూ ఆ కేసులో కోర్టు ఆదేశించింది. తన నుంచి బలవంతంగా కూతుర్ని తీసుకువెళ్లినట్లు ఓ మహిళ కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసింది. వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల తన కూతుర్ని లాక్కెళ్లినట్లు ఆమె భర్త కోర్టులో వాదించారు. ఈ కేసులో జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవల్ తీర్పునిస్తూ.. పితృస్వామ్య సమాజంలో మహిళను కించపరడం కామన్గా మారిందని, ఎటువంటి వాస్తవం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ సదరు మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్నా.. ఆ మహిళ మంచి తల్లి కాలేదని, ఆమెకు తన పిల్లల్ని కస్టడీకి ఇవ్వకుండా అడ్డుకోలేమని అన్నారు.
లుథియానాకు చెందిన జంటకు ఆస్ట్రేలియాలో పౌరసత్వం ఉన్నది. వాళ్లు 2013లో పెళ్లి చేసుకున్నారు. 2017లో వాళ్లకు కుమార్తె జన్మించింది. 2020 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చిన తర్వాత తల్లి నుంచి తండ్రి బంధువులు కుమార్తెను లాక్కెళ్లారు. మరో సంబంధం పెట్టుకోవడం వల్ల కుమార్తెను లాక్కు వచ్చినట్లు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ చిన్నారులకు తల్లి ప్రేము ముఖ్యమని, వారి అభివృద్ధిలో తల్లి అనురాగం కీలకమైందని జస్టిస్ తన తీర్పులో తెలిపారు. యుక్త వయసులో అమ్మాయిలకు తల్లి సహాకారం, మార్గనిర్దేశం కావాలన్నారు. హిందూ మైనార్టీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956లోని సెక్షన్ 6 ప్రకారం అయిదేళ్ల వరకు తల్లి సంరక్షణలోనే కూతురు పెరగాలని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

