Explosion | జమ్ముకశ్మీర్‌లో శివాలయం సమీపంలో పేలుళ్లు..
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో (Poonch) ఓ ఆలయం సమీపంలో పేలుడు (Explosion) సంభవించింది. జిల్లాలోని సురాన్‌కోట్ (Surankote) టౌన్లో ఉన్న శివాలయం (Shiv Mandir) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
పూంచ్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో (Poonch) ఓ ఆలయం సమీపంలో పేలుడు (Explosion) సంభవించింది. జిల్లాలోని సురాన్‌కోట్ (Surankote) టౌన్లో ఉన్న శివాలయం (Shiv Mandir) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బుధవారం రాత్రి 8.20 గంటల సమయంలో శివాలయం సమీపంలో ఉన్న బస్‌స్టాండ్ వద్ద భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. దీంతో హుటాహుటిన పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు.
కాగా, ఇది ఎలాంటి పేలుడు అనే విషయంపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. దుండగులు గ్రెనేడ్ విసినట్లు (Grenade attack) పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. పేలుడు ధాటికి ఆలయ గోడలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. కాగా, పేలుళ్ల వల్ల ఎవరికి హాని జరుగలేదని తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

