ఉత్తరాఖండ్ పోరు : కాంగ్రెస్ గూటికి బీజేపీ బహిష్కృత మంత్రి హరక్ సింగ్ రావత్!

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బహిష్కృత మంత్రి హరక్ సింగ్ రావత్ కాంగ్రెస్‌లో చేరతారనే సంకేతాలు పంపారు. హరక్ రావత్ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం హరీష్ రావత్‌తో సమావేశమయ్యారు. హరీష్ రావత్ తనకు సోదరుడు వంటి వాడని, ఆయనకు వందసార్లయినా క్షమాపణలు చెబుతానని హరక్ వ్యాఖ్యానించారు.
ఉత్తరాఖండ్ అభివృద్ధి తనకు ముఖ్యమని కాంగ్రెస్ నేతల నుంచి వచ్చే స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందని హరక్ రావత్ పేర్కొన్నారు. మరోవైపు హరక్ సింగ్ రావత్ కాంగ్రెస్‌లో ఇప్పటివరకూ చేరలేదని హరీష్ రావత్ తెలిపారు. వివిధ కోణాల్లో చర్చించి ఆపై పార్టీలో ఆయన చేరికపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హరక్ రావత్‌ను బీజేపీ ఆదివారం పార్టీ నుంచి బహిష్కరించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికార పగ్గాలు చేపడుతుందని, సామాన్యుడి సమస్యలను బీజేపీ ఎన్నటికీ అర్ధం చేసుకోదని హరక్ రావత్ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ ప్రజల సంక్షేమం కోసం తాను పాటుపడతానని అన్నారు. ఇక ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

