సెప్టెంబర్ నాటికి కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం..

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ టీకాకు ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఆమోదం దక్కలేదు. దీంతో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో నుంచి ఆమోదం దక్కకపోవడం వల్ల.. అనేక దేశాలు ఆ టీకాను తమ లిస్టులో చూపించడం లేదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఈయూ దేశాలు ఇంకా కోవాగ్జిన్ టీకాను తమ ఆమోదిత జాబితాలో చేర్చలేదు. వివిధ దేశాల్లో ఉన్న టాప్ యూనివర్సిటీలు.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపిన టీకాలు తీసుకున్నవారికే అనుమతి ఇస్తున్నారు. కోవాగ్జిన్ అప్రూవ్డ్ లిస్టులో లేదని, దీని వల్ల విద్యార్థులు హోటల్ క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుందని, 14 రోజుల పాటు హోటల్లో ఉండడం అంటే చాలా ఖరీదైన అంశం అవుతుందని లైమ్‌రిక్ వర్సిటీ అడ్వైజర్ సౌమ్యా పాండే తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదం పొందిన జాబితాలో ఫైజర్, మోడెర్నా, కోవీషీల్డ్ టీకాలు మాత్రమే ఉన్నాయి.
కోవాగ్జిన్‌కు ఆమోదం లభించే ప్రక్రియ కొనసాగుతున్నదని, 60 దేశాల్లో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అమెరికా, బ్రెజిల్, హంగేరీ దేశాలు తమ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అత్యవసర వినియోగం జాబితాను జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వోకు సమర్పించామని, జూలై లేదా సెప్టెంబర్ లోగా తమ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం దక్కుతుందని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొన్నది. టీకా అనుమతి కోసం డబ్ల్యూహెచ్‌వోకు సుమారు 90 శాతం డాక్యుమెంట్ పేపర్లను సమర్పించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. జూన్ నెలలో మిగిలిన వివరాలను డబ్ల్యూహెచ్‌వోకు సమర్పిస్తామని కంపెనీ పేర్కొన్నది.
విదేశీ వర్సిటీల్లో అకాడమి తరగతలు ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రారంభంకానున్నాయి. అయితే ఈ అంశంపై ప్రభుత్వ వర్గాలు కూడా స్పందించాయి. కోవాగ్జిన్ అప్రూవల్ కోసం డాక్యుమెంట్లు సమర్పించేందుకు భారత్ బయోటెక్ తుది దశ పనులు చేపడుతున్నట్లు కేంద్రం చెప్పింది. ఎఫ్‌డీఏ సాయంతో అమెరికాలో కోవాగ్జిన్ ట్రయల్స్ కూడా చేపట్టేందుకు ఆ సంస్థ సిద్దమైనట్లు ప్రభుత్వం పేర్కొన్నది. తమ టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఆరు నుంచి 8 నెలల వరకు ఉంటాయని భారత్ బయోటెక్ పేర్కొన్నది. నాలుగు రకాల కోవిడ్ వేరియంట్లపై ఆ కంపెనీ పేపర్స్ పబ్లిష్ చేసింది. కోవాగ్జిన్‌కు ఇప్పటి వరకు 13 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి దక్కింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

