Watch: జంతువులు కూడా ఈ ఆహారం తినవు… విలపించిన యూపీ పోలీస్ కానిస్టేబుల్
లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో పోలీసుల దయనీయ పరిస్థితి బయటపడింది. మెస్ ఫుడ్ నాణ్యతపై ఒక కానిస్టేబుల్ బోరున విలపించాడు. తమకు ఇచ్చే ఆహారాన్ని జంతువులు కూడా తినలేవని ఆరోపించాడు. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్ మనోజ్ కుమార్ అక్కడి మెస్ ఫుడ్పై ఆవేదన వ్యక్తం చేశాడు. రోటీలు, దల్ ప్లేట్ పట్టుకున్న అతడు దానిని అక్కడున్న వారికి చూపించి బోరున విలపించాడు. రోటీలను సరిగా కాల్చలేదని, పప్పు నీళ్ల లాగా ఉందని, అన్నం ఉడకలేదని ఆరోపించాడు.
పోలీసు సిబ్బందికి పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భృతిని అందజేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో ప్రకటించారంటూ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ గుర్తు చేశాడు. అయితే చాలా గంటలు డ్యూటీ చేసిన తర్వాత తమకు లభించే ఫుడ్ ఇదేనని, జంతువులు కూడా తినలేవంటూ విమర్శించాడు. సరైన ఆహారం లేకపోతే పోలీసులు ఎలా డ్యూటీ చేస్తారు? అని ప్రశ్నించాడు. మెస్ ఫుడ్ నాణ్యతను ప్రశ్నించినందుకు జాబ్ నుంచి తొలగిస్తామంటూ తనను బెదిరిస్తున్నారని ఆరోపించాడు. అయితే అక్కడున్న పోలీస్ అధికారి విలపిస్తున్న ఆ కానిస్టేబుల్ను సముదాయించేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఫిరోజాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుల్ మనోజ్ కుమార్ తరచుగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అతడి అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించి గతంలో 15 సార్లు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తాజా ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'Government makes us work for 12-12 hours and gives such food in return'
◆ Manoj Kumar, a constable of UP Police posted at Firozabad Headquarters, narrated his agony with tears.@firozabadpolice @Uppolice #zerodha pic.twitter.com/LLAssKWSMY
— Jamidar Ka Chora (@jamidarkachora) August 11, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Breaks Down
- Mess Food
- UP Cop
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

