Afghanistan: 550 మందిని తరలించాం.. అందులో 260 మంది భారతీయులు: విదేశాంగ శాఖ
ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.

న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. వీళ్లందరినీ కాబూల్ లేదా దుశాంబె నుంచి తరలించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇతర ఏజెన్సీ ద్వారా కూడా అక్కడి భారతీయులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా, తజకిస్థాన్లాంటి దేశాలతో తాము టచ్‌లో ఉన్నట్లు అరిందమ్ వెల్లడించారు.
మెజార్టీ శాతం భారతీయులను ఇప్పటికే తరలించినట్లు తాము అంచనాకు వచ్చామని ఆయన తెలిపారు. మరికొందరు ఆఫ్ఘనిస్థాన్‌లోనే ఉండొచ్చు. కచ్చితంగా ఎంత మంది ఉన్నారో తెలియదు అని అరిందమ్ అన్నారు. ఆఫ్ఘన్లతోపాటు కొన్ని ఇతర దేశాల వాసులను కూడా తాము ఇండియాకు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. వీళ్లలో చాలా మంది సిక్కులు, హిందువులు ఉన్నారు. అయితే ప్రధానంగా మేము భారతీయులపైనే దృష్టి సారిస్తున్నాం. అదే సమయంలో మనకు అండగా ఉన్న ఆఫ్ఘన్లకు అండగా ఉంటామని అరిందమ్ స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

