ఎప్స్టీన్తో హర్దీప్ రహస్య సమావేశం!
దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జరిపిన ప్రైవేట్ సమావేశాలపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. ఎప్స్టీన్, పురీ సమావేశం ఫొటోలను పంచుకున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన నాయకులు ఆ సంభాషణల గురించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఎప్స్టీన్ను ఒక ప్రతినిధి బృందంలో భాగంగానే కలిశానని, వ్యక్తిగత హోదాలో కాదని గతంలో పురీ చేసిన ప్రకటనను ఉద్దేశించి విపక్ష నాయకులు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు.
- ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం
- లైంగిక నేరస్థుడితో భేటీపై వివరణ ఇవ్వాలని విపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జరిపిన ప్రైవేట్ సమావేశాలపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. ఎప్స్టీన్, పురీ సమావేశం ఫొటోలను పంచుకున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన నాయకులు ఆ సంభాషణల గురించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఎప్స్టీన్ను ఒక ప్రతినిధి బృందంలో భాగంగానే కలిశానని, వ్యక్తిగత హోదాలో కాదని గతంలో పురీ చేసిన ప్రకటనను ఉద్దేశించి విపక్ష నాయకులు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు.
తాను ఎప్స్టీన్ను ఎప్పుడూ ఒంటరిగా(ముఖాముఖీగా) కలవవలేదని పురీ చేసిన వాదనను కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేథ్ ప్రశ్నించారు. తాను ఎప్స్టీన్ను ఎప్పుడూ ఒంటరిగా కలవలేదని హర్దీప్ పురీ చెప్పలేదా? మోదీ ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు, తన చుట్టూ ఉంచుకోవడానికి ఎవరిని ఎంచుకుంటారు? ఆర్ఎస్ఎస్ మహిళలను ఎప్పటికీ గౌరవించదని, వారిని సమానంగా చూడదని చెప్పడానికి ఇంకేమైనా నిదర్శనం కావాలా? అని ఆమె ప్రశ్నించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా కేంద్ర మంత్రి పురీపై విమర్శలు గుప్పించారు. ఎప్స్టీన్తో తాను జరిపిన సమావేశాల గురించి ఆ మంత్రి ఈ ఏడాది ప్రారంభంలో చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను ఆమె పంచుకున్నారు.
తాను ఎప్స్టీన్ను ఒక ప్రతినిధి బృందంలో భాగంగా కేవలం 3-4సార్లు మాత్రమే కలిశానని మంత్రి పురీ చెప్పారు. మరి ఈ రెండు ఫొటోల్లో మిగిలిన ప్రతినిధులంతా టేబుల్ కింద దాక్కున్నారేమో అని ఆమె చురకలు అంటించారు. ఎన్సీపీ(ఎస్పీ) ప్రతినిధి అనీష్ గవాండే ఆ ఫొటోలను దారుణమైనవిగా అభివర్ణించారు. ఒక దౌత్యవేత్త హోదాలో ఎప్స్టీన్ను ఎందుకు కలవవలసి వచ్చిందో చెప్పాలని ఆయన పురీని ప్రశ్నించారు. శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కూడా పురీ, ఎప్స్టీన్ ఫొటోను పంచుకుంటూ ఆ సమావేశం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
మోదీజీ, మీ మంత్రి హర్దీప్ పురీ ఎప్స్టీన్ను ఒంటరిగా కలుస్తున్నారేమిటి? ఆయన ఎవరి సందేశాన్ని తీసుకుని ఈ భేటీకి వెళ్లారు? ఇది కేవలం ఆరంభం మాత్రమే, ముందు ముందు ఏం జరగబోతుందో చూడండి! ఆర్ఎస్ఎస్ పాలన మారబోతున్నది! అని రౌత్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పురీ గతంలో చేసిన వ్యాఖ్యలను సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ప్రశ్నించారు. ఒక ఫొటోతో కూడిన తన పోస్ట్‌లో ఆయన ఎప్స్టీన్తో తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా సమావేశం కాలేదని పురీ చెప్పలేదా? అని నిలదీశారు.
పురీ గతంలో ఏం చెప్పారు?
అంతర్జాతీయ శాంతి సంస్థ(ఐపీఐ) ఏర్పాటు చేసిన బహుపాక్షికవాదంపై స్వతంత్ర కమిషన్(ఐసీఎం)కు అనుబంధంగా ఉన్న ఒక ప్రతినిధి బృందంలో భాగంగా తాను వృత్తిపరమైన హోదాలో ఎప్స్టీన్ను 3 లేదా గరిష్ఠంగా 4 సార్లు కలిసినట్టు ఫిబ్రవరిలో పురీ చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి పదవికి రాజీనామా చేసిన తర్వాత 2017లో కేంద్ర మంత్రివర్గంలో చేరకముందు ఈ సమావేశాలు జరిగాయని పురీ పేర్కొన్నారు. ఎప్స్టీన్తో తనకున్న పరిచయాలు పూర్తిగా వృత్తిపరమైనవని, ఆ అపఖ్యాతి పాలైన పెట్టుబడిదారుడిపై ఉన్న ఆరోపణలతో వీటికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

