Work From Home: ఇంటి నుంచే పని చేస్తామంటున్న ఉద్యోగులు: సర్వే
వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home).. చాన్నాళ్లు సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలకే పరిమితమైన ఈ ఆప్షన్.. కరోనా కారణంగా చిన్నచిన్న కంపెనీలకూ పాకింది. పని జరిగితే చాలు ఎక్కడైతే ఏంటి అనుకునే కంపెనీలు సాధ్యమైనంత వరకూ తమ ఉద్యోగులకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి.

న్యూఢిల్లీ: వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home).. చాన్నాళ్లు సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలకే పరిమితమైన ఈ ఆప్షన్.. కరోనా కారణంగా చిన్నచిన్న కంపెనీలకూ పాకింది. పని జరిగితే చాలు ఎక్కడైతే ఏంటి అనుకునే కంపెనీలు సాధ్యమైనంత వరకూ తమ ఉద్యోగులకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. అయితే మెల్లమెల్లగా కేసులు తగ్గుముఖం పట్టడం, సెకండ్ వేవ్ వెళ్లిపోవడంతో చాలా సంస్థలు మళ్లీ తమ ఆఫీసులను తెరుస్తున్నాయి. ఉద్యోగులను రమ్మంటున్నాయి. కానీ ఇంట్లో పని చేయడం అలవాటైన ఉద్యోగులు మాత్రం ఇలాగే కొనసాగితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. తాజా సర్వే ఒకటి 46 శాతం మంది ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తేల్చింది. మరో 29 శాతం మంది హైబ్రిడ్ మోడల్‌కు ఓకే అంటున్నారు.
అదే సమయంలో కంపెనీలు మాత్రం రివర్స్‌గా ఆలోచిస్తున్నాయి. 42 శాతం సంస్థలు హైబ్రిడ్ మోడల్ వైపు మొగ్గు చూపగా.. 35 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అంటున్నాయి. మహిళా ఉద్యోగుల విషయానికి వస్తే 51 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగాలని కోరుకుంటుండగా.. పురుషుల్లో ఇది 29 శాతంగా ఉంది. సీనియర్ మేనేజ్మెంట్లో 52 శాతం, మిడిల్ మేనేజ్మెంట్లో 36 శాతం, జూనియర్ లెవల్లో 31 శాతం ఇంటి నుంచి పని వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియా హైరింగ్ ట్రాకర్ పేరుతో ఈ సర్వే జరిగింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల హైరింగ్ 11 శాతం పెరిగినట్లు తేల్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

