న్యూఢిల్లీ: వాట్సాప్‌కు పోటీగా ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ (ట్విట్టర్) ఆడియో, వీడియో కాల్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని యాక్టివేట్ చేసుకోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ప్రైవసీ సేఫ్టీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అనంతరం ‘డైరెక్ట్ మెసేజ్’ ఆప్షన్‌ను ఎంచుకొని, ‘ఎనేబుల్ ఆడియో, వీడియో కాలింగ్’ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఫాలోవర్స్, వెరిఫైడ్ యూజర్స్ లేదా అందరితో మాట్లాడుకొనే విధంగా ఆప్షన్లు ఇచ్చారు.