ఎల్గర్ పరిషత్ కేసు నిందితులు జైలులో నిరాహార దీక్ష

ముంబై: ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన స్టాన్ స్వామి మరణానికి నిరసనగా ఈ కేసులోని మిగతా పది మంది నిందితులు ముంబైలోని తలోజా జైలులో బుధవారం నిరాహార దీక్ష చేశారు. ఈ కేసులో సహ నిందతులైన రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధవాలే, మహేష్ రౌత్, అరుణ్ ఫెర్రెరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, గౌతమ్ నవలఖా, ఆనంద్ టెల్తుంబే, రమేష్ గైచోర్, సాగర్ గోర్ఖే తలోజా జైలులో బుధవారం ఒక రోజు ఉపవాసం ఉన్నారు. స్టాన్ స్వామిని సంస్థాగతంగా హత్య చేశారని వారు ఆరోపించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ)తోపాటు తలోజా జైలు మాజీ అధికారి కౌస్తుబ్ కుర్లేకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుర్లేకర్, ఎన్ఐఏ అధికారులు 84 ఏండ్ల స్టాన్ స్వామిని చాలా హింసించడంతోపాటు పలు వేధింపులకు గురిచేశారని, ఆయనను సంస్థాగతంగా హత్య చేసేందుకే తమ నుంచి వేరు చేశారని వీరు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎల్గార్ పరిషత్, మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన స్టాన్ స్వామి గత ఏడాది నుంచి విచారణ ఖైదీగా ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

