వచ్చే సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు..!
Congress president: వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ మేరకు పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ మేరకు పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2022, సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి పర్మినెంట్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. గతంలో ఒకటి రెండు సార్లు శాశ్వాత అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రయత్నాలు జరిగినా ఆ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మరికొంత కాలం సోనియానే పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఆమెనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం జరుగడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూఢిల్లీలోని ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కరోనా మహమ్మారి దేశంలో కాలుమోపిన తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం జరుగడం ఇదే తొలిసారి. పార్టీ సంస్థాగత ఎన్నికలు, వచ్చే ఏడాది జరుగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, లఖింపూర్ ఖేరీ ఘటన సమావేశం ఎజెండాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇటీవలి పరిణామాలపై కూడా సమావేశం ఎజెండాలో ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

