ఫామ్ 6పై ఎన్నికల సంఘం యూటర్న్!
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) వరుసగా తీసుకుంటున్న యూ-టర్న్లలో భాగంగా తాజాగా మరో కీలక మార్పు చేసింది. గత 10 నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్వీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 14 నోట్స్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసిన దాదాపు అన్ని నిర్ణయాలను ఈసీఐ ఇప్పటికే వెనక్కి తీసుకుంది.
- ఆన్లైన్ దరఖాస్తు నుంచి ‘సర్’ డిక్లరేషన్ తొలగింపు
న్యూఢిల్లీ, నవంబర్ 4: భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) వరుసగా తీసుకుంటున్న యూ-టర్న్లలో భాగంగా తాజాగా మరో కీలక మార్పు చేసింది. గత 10 నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్వీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 14 నోట్స్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసిన దాదాపు అన్ని నిర్ణయాలను ఈసీఐ ఇప్పటికే వెనక్కి తీసుకుంది. దీని కొనసాగింపుగా ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ కొనసాగుతున్న రాష్ర్టాల్లో ఓటర్ల నమోదుకు సంబంధించిన చట్టబద్ధమైన ‘ఫామ్-6’ ఆన్లైన్ వెర్షన్ నుంచి ‘సర్’కు సంబంధించిన డిక్లరేషన్ను తొలగించింది.
దీన్ని బట్టి కొత్త ఓటర్ల కోసం ఆన్లైన్ నమోదు దరఖాస్తులోని సెక్షన్ జే, కే మధ్య చేర్చిన డిక్లరేషన్ ఇకపై ఫామ్ 6లో భాగం కాదు. ఈ డిక్లరేషన్ దరఖాస్తుదారులను మూడు వాక్యాల్లో ఒకదాన్ని ఎంచుకోమని కోరింది. ఆరు వారాల వ్యవధిలో ఫామ్ 6 విషయంలో ఈసీఐ తీసుకున్న మూడవ వైఖరి ఇది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

