Electoral Bonds | సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన ఎస్బీఐ.. ఈసీ వెబ్సైట్లో ఎన్నికల బాండ్ల డాటా
ఎట్టకేలకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం అల్ఫా-న్యూమెరిక్ నంబర్లతో కూడిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అందించింది. ఈ వివరాలను ఎన్నికల కమిషన్.. తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
- ఈసీ వెబ్సైట్లో పూర్తి వివరాల వెల్లడి
- ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీకి అందజేత
Electoral Bonds | న్యూఢిల్లీ, మార్చి 21: ఎట్టకేలకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం అల్ఫా-న్యూమెరిక్ నంబర్లతో కూడిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అందించింది. ఈ వివరాలను ఎన్నికల కమిషన్.. తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఎన్నికల బాండ్ల దాతలు, అందుకున్న వారి వివరాలతో కూడిన రెండు వేర్వేరు జాబితాలను వెబ్సైట్లో పెట్టింది. వీటిల్లోని వివరాల ఆధారంగా ఏ పార్టీకి ఎవరు ఎన్నికల బాండ్లు ఇచ్చారనేది వెల్లడి కానుంది. కాగా, ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు ఈసీకి అందించినట్టు గురువారం సుప్రీంకోర్టులో ఎస్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
కేవైసీ వివరాలు బయట పెట్టలేం: ఎస్బీఐ
ఎన్నికల బాండ్ల దాతలు, అందుకున్న వారికి సంబంధించి కేవైసీ వివరాలు, పూర్తి బ్యాంక్ అకౌంట్ నెంబర్లను మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టుకు ఎస్బీఐ తెలిపింది. బాండ్లు కొన్న వారి పేర్లు, బాండ్ల విలువ, నంబరు, బాండ్లను ఎన్క్యాష్ చేసుకున్న పార్టీ పేరు, పార్టీ బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు వంటి వివరాలను ఈసీకి అందించామని, ఈ వివరాల ద్వారా దాతలెవరో, అందుకున్న రాజకీయ పార్టీలేవో తెలిసిపోతుందని ఎస్బీఐ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

