Election commission | అప్పీల్‌కు నెల ఉందిగా.. వయనాడ్ ఉప ఎన్నికపై సీఈసీ
ర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, అలా జరుగలేదు. దీంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది.
- ఎన్నికకు హడావుడి ఏమీలేదు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, అలా జరుగలేదు. దీంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. వయనాడ్ ఉప ఎన్నిక నిర్వహణకు ఎలాంటి హడావుడి లేదని తేల్చేశారు. ‘వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక విషయంలో ఎలాంటి హడావుడి లేదు. కేసు విషయంలో అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు రాహుల్‌గాంధీకి నెలరోజుల సమయం ఇచ్చింది. మేం వేచి చూస్తాం. ఆ గడువు తర్వాత మేం స్పందిస్తాం.
వయనాడ్ స్థానం మార్చి 23న ఖాళీ అయింది. చట్టంప్రకారం.. ఆరునెలల్లో ఎన్నిక నిర్వహించాలి. అయితే మిగిలిన పదవీకాలం సంవత్సరంలోపే ఉంటే.. అప్పుడు ఎన్నిక నిర్వహించాల్సిన పని లేదని చట్టం చెబుతున్నది. కానీ, వయనాడ్ విషయంలో అది ఏడాదికి మించి ఉంది’ అని పేర్కొన్నారు. అప్పీల్ సమయం ముగిసిన తర్వాత వయనాడ్ ఎన్నిక నిర్వహణపై నిర్ణయం తీసుకొంటామని సీఈసీ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజయం సాధించారు. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు ఇటీవల రెండేండ్ల జైలుశిక్ష విధించింది. పై కోర్టులో అప్పీల్‌కు 30 రోజుల సమయమిచ్చింది. అయితే, తీర్పు వెలువడిన 24 గంటల్లోనే లోక్‌సభ సచివాలయం రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నది. అయితే, పై కోర్టులో అప్పీల్‌కు ట్రయల్ కోర్టు నెల రోజులు సమయమిచ్చినా, రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని హడావుడిగా రద్దు చేయడమేంటని విమర్శలు వ్యక్తమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

