న్యూడిల్లీ : తమిళనాడులోని ఆదియోగి శివ విగ్రహాన్ని సందర్శించిన వృద్ధ దంపతుల వీడియో (viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భార్య ఫొటోను పర్ఫెక్ట్గా తీసేందుకు పెద్దాయన ప్రయత్నించడం కనిపిస్తుంది.
ఈ వీడియోను యోగ విత్ కుష్ ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. వైరల్ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 70 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఆదియోగి శివ విగ్రహాన్ని సందర్శించిన వృద్ధ దంపతులను ఈ వీడియో పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసింది. ఈ క్లిప్‌లో పెద్దాయన తన భార్యను వివిధ కోణాల్లో పర్ఫెక్ట్ పిక్చర్ కోసం కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది.
భర్త కోరిన విధంగా నవ్వుతూ భార్య పోజులు ఇవ్వడం ఆకట్టుకుంటుంది. దంపతుల అన్యోన్య బంధంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఇది స్వచ్ఛమైన ప్రేమని ఓ యూజర్ కామెంట్ చేయగా ట్రూలవ్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :