Khushboo Sundar | నటి ఖుష్బూ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఖుష్బూ ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమానే తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరోయిన్ నుంచి రిటైర్ అయ్యాక సపోర్టింగ్ యాక్టర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మంచి మంచి పాత్రలు చేస్తూ దుసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై రియాక్టయింది. తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయపెట్టింది.
తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు ఖుష్బూ వెల్లడించింది. తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అయితే అప్పుడు తన వయసు ఎనిమిదేళ్లని, పదిహేనేళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని చెప్పింది. దాంతో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని తెలిపింది. లైంగిక వేధింపులపై ప్రస్తుతం కుష్బూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తిపెంచుకుంది. వినోద్‌ఖన్నా హీరోగా నటించిన ‘ద బర్నింగ్ ట్రైన్’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఇక ఖుష్బూ తమిళ దర్శకుడు, నటుడు సి.సుందర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.