Ravanasura | ఆసక్తి రేకెత్తిస్తున్న రావణాసుర టీజర్.. చూస్తుంటే రవితేజ హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడుగా
మాస్‌రాజా చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
Ravanasura Movie Teaser | మాస్ మహరాజా రవితేజ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సాధించి పట్టుకోల్పోయిన తన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాడు. ప్రస్తుతం రవన్న హ్యట్రిక్‌పై కన్నేశాడు. మాస్‌రాజా చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే రిలీజైన రావణాసుర ఆంథమ్, ప్యార్‌లోన పాగల్ పాటలు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసాయి. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచుతుంది. మేకర్స్ టీజర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు. ఓ క్రిమినల్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ చేసే వేట ఇదని స్పష్టమవుతుంది. యాక్షన్ బ్లాక్స్‌తో టీజర్ అదిరిపోయింది. వైల్డ్ క్యారెక్టర్లో రవితేజ నటన వేరే లెవల్లో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు రవితేజ చేయని పాత్ర ఇదని తెలుస్తుంది. సుశాంత్‌కు కూడా ఈ సినిమాలో మంచి పాత్రే దక్కినట్లుంది. ముఖ్యంగా హర్షవర్ధన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను ఎక్కడితో తీసుకెళ్లిపోయింది. ఇక టీజర్ లాస్ట్‌లో వచ్చిన షాట్ అయితే వేరే లెవల్. సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఆసక్తిని పెంచుతుంది.
మొత్తంగా టీజర్‌తోనే సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. రవితేజకు జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లాలు నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

