భార్య మృతదేహాన్నిసైకిల్పై మోసిన వృద్ధుడు

లక్నో: మరణించిన మహిళ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలకు గ్రామస్తులు కరోనా భయంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వృద్ధుడైన భర్త, తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై మోసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక ఇక ముందుకు సాగలేక రోడ్డుపై సైకిల్, భార్య మృతదేహాన్ని వదిలి పక్కన కూర్చొండిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
జౌన్పూర్ జిల్లా మాడియాహు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్‌పూర్‌కు చెందిన తిలక్‌ధారీ సింగ్ భార్య 50 ఏండ్ల రాజకుమారి కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది. ఉమనాథ్ సింగ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మరణించింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి చేర్చారు.
మరోవైపు రాజకుమారి కరోనాతో చనిపోయి ఉంటుందని గ్రామస్తులు భయాందోళన చెందారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని భర్తకు చెప్పారు. సహాయానికి కూడా ఎవరూ ముందుకురాలేదు. దీంతో వృద్ధుడైన భర్త తిలర్ధారీ సింగ్ తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై మోసుకెళ్లాడు. అంత్యక్రియల కోసం చోటు వెదుకుతూ కొన్ని గంటలపాటు తిరిగాడు. ఇక ఓపిక లేక సైకిల్‌పై ఉన్న భార్య మృతదేహాన్నిరోడ్డుపై వదిలి పక్కన కూర్చొండిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న జౌన్పూర్ పోలీసులు ఆ వృద్ధుడి వద్దకు చేరుకున్నారు. అతడి భార్య అంత్యక్రియలను రామ్‌ఘాట్‌లో మంగళవారం జరిపించారు. కాగా, వృద్ధుడైన భర్త, అంత్యక్రియల కోసం తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై మోసుకెళ్లిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సహాయానికి ముందుకురాని, అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పిన గ్రామస్తులపై నెటిజన్లు మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

