ఇంట్లో చొరబడి వృద్ధ దంపతుల దారుణహత్య..!
Double murder in Rajasthan: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్యచేశారు.

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్యచేశారు. అజ్మీర్‌లోని గౌలపుర ఏరియాలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గౌలపురా ఏరియాలో మదన్ సింగ్ (85), ఆయన మైనా దేవి (81) ఓ ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. వారి ఇంటికి సమీపంలోనే కుమారుడి ఇల్లు కూడా ఉన్నది.
ఈ క్రమంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మదన్ సింగ్ ఇంట్లో చొరబడ్డారు. మదన్సింగ్ను, ఆయన భార్య మైనాదేవిని గొంతుకోసి చంపేశారు. మంగళవారం ఉదయం మృతుల కుమారుడు తల్లిదండ్రులకు టీ ఇచ్చేందుకు వెళ్లగా దారుణం వెలుగుచూసింది. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలిపై ఉన్న ఆభరణాల కోసమే దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

