ముసాయిదాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు మరో అవకాశం!
ఏడు రాష్ర్టా ల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శుక్రవారం ప్రకటించింది.
- తెలంగాణ సహా 7 రాష్ర్టాలకు వర్తింపు
- ఎన్నికల సంఘం ప్రకటన
న్యూఢిల్లీ, నవంబర్ 6: ఏడు రాష్ర్టా ల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శుక్రవారం ప్రకటించింది. గణన పత్రాలు జారీ చేసినప్పటికీ గైర్హాజరు, స్థానచలనం, మరణం లేదా నకిలీ(ఏఎస్‌డీడీ)గా వర్గీకరించిన తర్వాత ముసాయిదా జాబితాల నుంచి తొలగింపునకు గురైన ఓటర్లకు ఈ ఆదేశం వర్తిస్తుంది.
ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ర్టాలు ఈ ఆదేశం పరిధిలోకి వస్తాయి. తుది ఓటర్ల జాబితాలో చేరే అవకాశాన్ని ఏ అర్హత గల ఓటరుకు కూడా నిరాకరించకుండా చూసేందుకు, నకిలీ నమోదులను నివారించేందుకు ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఈసీ ఆదేశించింది. ఏఎస్డీడీగా గుర్తించబడి, ఫలితంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరులేని ఓటరు రాష్ట్రంలోనే తన నివాస స్థలాన్ని మార్చుకున్న సందర్భాలలో అటువంటి ఓటరు ఫామ్-8 సమర్పించాల్సిన అవసరం లేదు.
దానికి బదులుగా వారు ఇక్కడ అనుబంధం-సీ(అనెక్జర్-సీ) జతచేసిన డిక్లరేషన్‌తో(కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని సూచిస్తూ) పాటు గణన పత్రాన్ని సమర్పించాలి అని ఈసీ తెలిపింది. సర్‌లో భాగంగా కొత్త నమోదు కోసం ఇప్పటికే ఫామ్-6 సమర్పించిన ఓటర్లు గణన ఫామ్, దానితో పాటు డిక్లరేషన్‌ను మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. నవంబర్ 3న కమిషన్ జారీ చేసిన వివరణకు అనుగుణంగా వారి దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని తెలిపింది. సంబంధిత ఓటర్లను సంప్రదించేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని బూత్ స్థాయి అధికారులను(బీఎల్ఓ) ఈసీ ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

