Earthquake | భూ ప్రకంపణలతో వణిపోయిన అండమాన్ తీరం, మణిపూర్
Earthquake | భూ ప్రకంపణలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్‌లోని (Manipur) ఉక్రుల్ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake).
Earthquake | భూ ప్రకంపణలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్‌లోని (Manipur) ఉక్రుల్ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 93 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. సోమవారం వేకువజామున 4.4 తీవ్రతతో బంగాళాఖాతం (Bay of Bengal) తీరంలో భూమి కంపించిందని పేర్కొంది.

ఇక సోమవారం రాత్రి 11.1 గంటలకు మణిపూర్‌లోని ఉఖ్రుల్ (Ukhrul) జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.1గా నమోదయిందని ఎన్సీఎస్ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులు ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. రాత్రివేల భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

