ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.36 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
కొల్హాపూర్‌కు (Kolhapur) 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు భూమి కంపించిందని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయితే అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్లను బయటకు పరుగులు తీశారు.