Stomach Pain: కడుపులో నట్లు, బోల్టులు, వైర్లు.. సర్జరీ చేసి తీసిన డాక్టర్లు
Stomach Pain: చిత్రవిచిత్రమైన వస్తువుల్ని ఓ వ్యక్తి కడపులోంచి తీశారు. నొప్పి తట్టుకోలేకపోతున్న ఆ వ్యక్తి డాక్టర్లు ఆశ్రయించాడు. అతని సర్జరీ చేసి కడుపులో నుంచి ఇయర్‌ఫోన్స్, వాషర్స్, నట్స్, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్, బటన్స్, వ్రాపర్స్, హెయిర్ క్లిప్‌లను తీశారు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది.
చండీఘడ్: రెండేళ్ల నుంచి కడుపు నొప్పి(Stomach Pain)తో బాధపడుతున్న ఓ వ్యక్తి కడుపులోంచి విచిత్రమైన వస్తువుల్ని డాక్టర్లు సర్జరీ చేసి తీశారు. ఈ ఘటన పంజాబ్‌లోని మోగాలో జరిగింది. ఆ నగరంలో ఉన్న మెడిసిటీ హాస్పిటల్లో అతనికి చికిత్స చేశారు. తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పితో 40 ఏళ్ల వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లాడు. నొప్పి ఎక్కువగా ఉందనడంతో.. అతనికి ఎక్స్ రే తీశారు. ఆ రిపోర్టు చూసిన డాక్టర్లు ఖంగుతిన్నారు. ఆ వ్యక్తి కడుపులో ఉన్న వస్తువుల్ని చూసి షాక్ అయ్యారు. ఆ పేటెంట్ కడుపులో అన్నీ మెటల్ వస్తువులు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సుమారు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి అతని కడుపు నుంచి ఆ ఐటమ్స్ తీశారు.
ఆ పేషెంట్ కడుపులో ఇయర్‌ఫోన్స్, వాషర్స్, నట్స్, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్, బటన్స్, వ్రాపర్స్, హెయిర్‌క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, సెఫ్టీ ఫిన్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి కేసును ఆపరేట్ చేయడం ఇదే తొలిసారి అని డాక్టర్ అజ్మీర్ కల్రా తెలిపారు. ఆ పేషెంట్ శరీరం నుంచి అన్ని వస్తువుల్ని తీసివేసినా.. అతని ఆరోగ్యం నిలకడగా లేదన్నారు. ఖనిజ వస్తువులు చాన్నాళ్ల నుంచి అతని కడుపులో ఉన్న కారణంగా.. అతని ఆరోగ్యంపై ప్రభావం పడిందని డాక్టర్లు తెలిపారు. ఆ వ్యక్తి ఎందుకు ఆ వస్తువుల్ని మింగాడో అర్థం కావడం లేదని ఫ్యామిలీ సభ్యులు తెలిపారు. అయితే అతను గత కొన్నాళ్ల నుంచి మానసికమైన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

