marriage cancelled | ఫుల్‌గా మద్యం సేవించి పెళ్లి సంగతి మరిచిన వరుడు.. వివాహాన్ని రద్దు చేసిన వధువు
marriage cancelled | ఒక వరుడు తన పెళ్లి సంగతిని మరిచిపోయాడు. ఫుల్‌గా మద్యం సేవించి నిద్రపోయాడు. దీంతో వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతడితో పెళ్లిని రద్దు (marriage cancelled) చేసింది.
పాట్నా: ఒక వరుడు తన పెళ్లి సంగతిని మరిచిపోయాడు. ఫుల్‌గా మద్యం సేవించి పెళ్లికి వెళ్లకుండా నిద్రపోయాడు. దీంతో వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతడితో పెళ్లిని రద్దు (marriage cancelled) చేసింది. బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుల్తాన్‌గంజ్ గ్రామానికి చెందిన వ్యక్తికి ఒక మహిళతో పెళ్లి జరుగాల్సి ఉంది. అయితే వివాహం రోజున అతడు సంతోషం పట్టలేక ఫుల్‌గా మద్యం తాగాడు. వెళ్లి వేదిక వద్దకు వెళ్లడం మర్చిపోయాడు. ఆపై మత్తుగా నిద్రపోయాడు.
కాగా, వరుడి కోసం వధువు, ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి వేదిక వద్ద చాలా సేపు ఎదురు చూశారు. అతడు ఎంతకీ రాకపోవడంతో వరుడి తరుఫు బంధువులను నిలదీశారు. చివరకు మద్యం మత్తు దిగిన తర్వాత పెళ్లికొడుకు హడావుడిగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లాడు. అయితే అతడ్ని పెళ్లి చేసుకునేందుకు పెళ్లికుమార్తె నిరాకరించింది. బాధ్యతలను అర్థం చేసుకోని వ్యక్తితో జీవితాన్ని గడపలేనని చెప్పింది. దీంతో పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు చేసిన డబ్బును తమకు చెల్లించాలని వరుడి కుటుంబాన్ని వధువు కుటుంబీకులు డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులను వధువు కుటుంబీకులు కొంతసేపు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు. ఘర్షణను నివారించి పరిస్థితిని చక్కదిద్దారు.
Also Read:
Watch | వరమాల సమయంలో జారిన వరుడి పైజామా.. వధువు ఎలా స్పందించిందంటే!
Watch | పాకిస్థాన్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

