Kedarnath Dham Yatra: కేదార్నాథ్ యాత్ర నిలిపివేత.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Kedarnath Dham Yatra: కేదార్నాథ్ యాత్రను ఆపేశారు. ఇవాళ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో యాత్రికుల్ని సోనుప్రయాగ్, గౌరికుండ్ వద్ద నిలిపివేశారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు.
రుద్రప్రయాగ్: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్ర(Kedarnath Dham Yatra)ను నిలిపివేశారు. సోన్‌ప్రయాగ్, గౌరికుండ్ వద్ద యాత్రికులను నిలిపివేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. భక్తుల భద్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో యాత్రికుల్ని ఆపేసినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాల వల్ల నాలుగు రహదారుల్ని మూసివేశారు. కొండచరియలు విరిగిపడడం వల్ల పది లింకు రోడ్డులను కూడా బ్లాక్ చేశారు. మందాకిని, అలకనంద నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఐఎండీ ఇవాళ ఉత్తరాఖండ్ కోసం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ ట్వీట్ చేసింది.
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పీడబ్ల్యూడీ శాఖలన్నీ రెఢీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. గంగోత్రి జాతీయ రహదారిపై మంగళవారం కొండచరియలు విరిగిపడడం వల్ల నలుగురు మృతిచెందారు. పది మంది గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
Sonia Gandhi | ‘నాడు మేనక చెప్పిన ఆ అబద్దం నన్ను చాలా బాధించింది’.. ఆత్మకథలో సోనియాగాంధీ వెల్లడి
‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం’
Ghatkesar Bus stand | ‘నీళ్లు లేవు.. రేపు రాగలరు’.. ఇంతకీ ఈ బోర్డు ఎక్కడ పెట్టారో తెలుసా..?
‘గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

