Dry Promotion | జాబ్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. డ్రై ప్రమోషన్
ఆర్థిక మాంద్యం, మారుతున్న టెక్నాలజీ, పరిశ్రమ అవసరాలు, సంక్షోభ పరిస్థితులు వెరసి సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో పనితీరులో కొత్త పోకడలు పెరుగుతున్నాయి.
- మొన్న వీఎఫ్‌హెచ్, మూన్‌లైటింగ్
- నిన్న కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్
- నేడు జాబ్ మార్కెట్‌కి ‘డ్రై ప్రమోషన్’
- ఆర్థికమాంద్యం, సంక్షోభాలే కారణం
Dry Promotion | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఆర్థిక మాంద్యం, మారుతున్న టెక్నాలజీ, పరిశ్రమ అవసరాలు, సంక్షోభ పరిస్థితులు వెరసి సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో పనితీరులో కొత్త పోకడలు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వర్క్‌ఫ్రమ్‌హోమ్ (వీఎఫ్‌హెచ్), మూన్‌లైటింగ్ ట్రెండ్ రాజ్యమేలగా, నిన్న కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ ధోరణి ఎక్కువగా కనిపించింది. తాజాగా ఇప్పుడు ‘డ్రై ప్రమోషన్’ ట్రెండ్ జాబ్ మార్కెట్లో కొనసాగుతున్నది.
ఏమిటీ ‘డ్రై ప్రమోషన్’?
ఉద్యోగ జీవితంలో ప్రమోషన్ (పదోన్నతి) అనేది సాధారణమైన ప్రక్రియ. ఉద్యోగి పని, అనుభవం, నైపుణ్యాలను బట్టి ప్రమోషన్ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రమోషన్ అంటే బాధ్యతలతో పాటు వేతనాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలూ పెరుగుతాయి. కానీ, హోదాను (డెసిగ్నేషన్తో పాటు బాధ్యతలు కూడా) మాత్రమే పెంచి.. వేతనం, ప్రోత్సాహకాలను ఏ మాత్రం పెంచకుండా ఉంచే పద్ధతిని ‘డ్రై ప్రమోషన్’గా పిలుస్తున్నారు. ఈ పద్ధతిలో హోదా పెరుగుతుందే కానీ అదే శాలరీ ఉంటుంది.
ఎందుకు ఇలా?
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకొంటున్నాయి. ఇంకొన్ని కంపెనీలు జీతాల పెంపును నిలిపేశాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న మరికొన్ని కంపెనీలు మాత్రం ఇలాంటి డ్రై ప్రమోషన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే అదే జీతానికి ఎక్కువ బాధ్యతలను అప్పగిస్తూ ప్రమోట్ చేస్తున్నాయి. వేతనం పెరుగకపోయినా.. హోదా పెరగడం వల్ల ప్రయోజనమూ ఉంటుందని కొందరు నిపుణులు అంటున్నారు. జాబ్ మారాలనుకునేవారు కొత్త కంపెనీలో ఉన్నత హోదాలో బాధ్యతలు స్వీకరించే అవకాశం దీని ద్వారా లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
వీటికి అర్థం తెలుసా?
- మూన్‌లైటింగ్ కంపెనీ యాజమాన్యానికి తెలియకుండా రెండో ఉద్యోగాన్ని చేయడం.
- కాఫీ బ్యాడ్జింగ్ – ఆఫీసుకు కచ్చితంగా రావాలని యాజమాన్యం రూల్స్ పెడితే, ఆఫీసుకు వచ్చి కాసేపు కాఫీ తాగి మేనేజర్లు, హెచ్ఆర్ల దృష్టిలో పడటం.
- క్వైట్ క్విటింగ్- వేతనాన్ని బట్టి ఒప్పందం ప్రకారం.. కేవలం అప్పగించిన బాధ్యతలనే పూర్తిచేయడం. మిగతావాటిని విస్మరించడం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

