Watch: తాగిన మత్తులో పబ్ బయట అమ్మాయిల రచ్చ రచ్చ.. నలుగురు కలిసి మరో అమ్మాయిపై దాడి
ఆ మహిళ సహాయం కోసం కేకలు వేసినప్పటికీ అక్కడున్న వారు ఎవరూ కూడా పట్టించుకోలేదు. నలుగురు మహిళల దాడి నుంచి ఆమెను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
భోపాల్: తాగిన మత్తులో అమ్మాయిలు నానా రచ్చ చేశారు. పబ్ బయట ఒకరినొకరు తన్నుకున్నారు. నలుగురు అమ్మాయిలు కలిసి మరో అమ్మాయిపై బెల్ట్‌లు, చెప్పులతో దాడి చేశారు. కర్రలతో దారుణంగా కొట్టారు. అమ్మాయిల గొడవను అక్కడున్నవారందరూ సినిమా చూసినట్లు చూశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. బూతులు తిడుతూ ఆమె జుట్టు లాగి, కిందపడేసి కొట్టారు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేసినప్పటికీ అక్కడున్న వారు ఎవరూ కూడా పట్టించుకోలేదు. కనీసం ఆ కొట్లాటను ఆపుదామని ఎవరూ ముందుకు రాలేదు. కళ్లప్పగించి అమ్మాయిల ఫైటింగ్‌ను తమాషా చేసినట్లు చూశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇండోర్ పోలీసులు దీనిపై స్పందించారు. మహిళను దారుణంగా కొట్టిన నలుగురు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ మహిళపై వారు దాడి చేయడానికి కారణం ఏమిటన్నది తెలియలేదు.
उड़ता इंदौर.. नशे में धुत्त लड़कियों का पब के बाहर मारपीट का वायरल वीडियो @IndoreCollector @hariips @drnarottammisra pic.twitter.com/jcSKohDEve
— Brajesh Rajput (@drbrajeshrajput) November 7, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

