Watch: మద్యం మత్తులో మహిళ హంగామా.. పోలీసులపై దాడి, వీడియో వైరల్
Drunk Woman created ruckus | మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ హంగామా చేసింది (Drunk Woman created ruckus). అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను అసభ్యంగా తిట్టడంతోపాటు వారిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులను రప్పించి అతికష్టంతో ఆమెను అరెస్ట్ చేశారు.
అహ్మదాబాద్: మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ హంగామా చేసింది (Drunk Woman created ruckus). అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను అసభ్యంగా తిట్టడంతోపాటు వారిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులను రప్పించి అతికష్టంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఫుల్‌గా మద్యం సేవించిన ఒక మహిళ కారు డ్రైవ్ చేసింది. ఈ నేపథ్యంలో ఒక వాహనాన్ని ఢీకొట్టింది.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ పోలీసులను అసభ్యంగా తిట్టింది. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేసింది. దీంతో మహిళా పోలీసులను రప్పించారు. వారి సహాయంతో ఆమెను బలవంతంగా కారు నుంచి కిందకు దించారు. పోలీస్ వాహనంలోకి ఎక్కించబోయిన మహిళా పోలీసులను కూడా ఆమె కొట్టింది. చివరకు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు మద్యం సేవించి వాహనం నడపడం, గందరగోళం సృష్టించడం, పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హంగామా చేసిన ఆ మహిళను ప్రముఖ నెయిల్ ఆర్టిస్ట్‌గా గుర్తించారు. కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman caught in drink and drive Part 2 –
byu/arxym invadodara
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Attack
- cops
- drunk woman
- Gujarat
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

