India-Pak Tensions | కాల్పుల విరమణ అంటూనే బుద్ధిని చూపించిన పాకిస్తాన్..! రాజస్థాన్‌లో తొమ్మిది జిల్లాల్లో బ్లాక్అవుట్ అమలు..!
India-Pak Tensions | కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన కొద్దిగంటల్లోనే దాయాది దేశం మరోసారి తన బుద్ధిని చూపించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. జైసల్మేర్‌లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి.
India-Pak Tensions | జైపూర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన కొద్దిగంటల్లోనే దాయాది దేశం మరోసారి తన బుద్ధిని చూపించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. జైసల్మేర్‌లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. బార్మర్, శ్రీగంగానగర్‌లలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించగా.. భారత సైన్యం వాటిని కూల్చివేసింది. దాంతో ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బార్మర్, శ్రీగంగానగర్, బికనీర్, జైసల్మేర్ అంతటా ప్రశాంతత నెలకొందని పేర్కొన్నారు. శనివారం రాత్రి 11.37 గంటల ప్రాంతంలో జైసల్మేర్ పశ్చిమ వైపు నుంచి ఆరు పెద్ద పేలుళ్లు వినిపించాయి. దాంతో జనం భయాందోళనకు గురయ్యారు. అంతకు ముందు కాల్పుల విరమణ ప్రకటన తర్వాత బార్మర్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఫలోడి, బికనీర్, గంగానగర్, హనుమాగఢ్లో మార్కెట్లు తిరిగి తెరిచారు.
రాత్రి వరకు మళ్లీ పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించగా అధికారులు ముందు జాగ్రత్తగా పాలి, బలోత్రాతో సహా తొమ్మిది జిల్లాల్లో మళ్లీ బ్లాక్అవుట్ అమలు చేశారు. బార్మెర్లో కలెక్టర్ టీనా దాబీ శనివారం రాత్రి హెచ్చరికలు చేశారు. ప్రజలు అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికార యంత్రాంగం కోరింది. సోషల్ మీడియా ద్వారా ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే, స్థానిక మార్కెట్లు మూతపడ్డాయి రాత్రంతా పలుసార్లు సైరన్లు మోగాయి. ప్రజలు ఇండ్లకు వెళ్లిపోగా.. వీధులు ఖాళీ అయ్యాయి. జైసల్మేర్‌లో శనివారం రాత్రి ఆలస్యంగా పేలుడు శబ్దాలు వినిపించినప్పటికీ.. ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి ప్రశాంతంగా, నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. అయినా, భద్రతా దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. స్థానిక పరిపాలన సరిహద్దులో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

