భారత్లో కొన్నాళ్లు లాక్డౌన్ విధించాలి

న్యూఢిల్లీ, మే 1: భారత్లో రెండో దశ కరోనా ఉద్ధృతి కట్టడికి దేశవ్యాప్తంగా కొన్ని వారాల పాటు లాక్డౌన్ విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌచీ సూచించారు. భారత్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నదన్న ఆయన… మరో రెండు సూచనలు కూడా చేశారు. చైనా తరహాలో తాత్కాలిక దవాఖానలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కరోనా పరిస్థితుల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని సూచించారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆక్సిజన్, ఔషధాలు, పీపీఈ కిట్లను ఎలా సమకూర్చుకోవాలో ప్రణాళికను రూపొందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అమెరికాలో తాము నేషనల్ గార్డ్ సహాయం తీసుకున్నట్టు భారత్ కూడా తన సైన్యం తోడ్పాటును పొందాలని సూచించారు. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలన్నారు. 1.4 బిలియన్ జనాభా కలిగిన భారత్… వ్యాక్సిన్ డోసుల కోసం తయారీదారులతో వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకోవాలని చెప్పారు. కరోనాపై విజయం సాధించేసినట్టు భారత ప్రభుత్వం చాలా ముందే ప్రకటించిందని గుర్తుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

