Supreme Court: చైల్డ్ పోర్న్ వీడియోలు వీక్షించడం, డౌన్లోడ్ చేయడం.. పోక్సో నేరమే: సుప్రీంకోర్టు
Supreme Court: చిన్నారులపై జరిగే లైంగిక నేరాల అంశంలో ఇవాళ సుప్రీంకోర్టు ఓ క్లారిటీ ఇచ్చింది. చైల్డ్ పోర్న్ వీడియోలను చూసినా, డౌన్లోడ్ చేసినా, ఆ నేరాలు పోక్సో చట్టం పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ కీలక తీర్పును ఇచ్చింది. చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను డౌన్ లోడ్ చేయడం కానీ, వీక్షించడం కానీ.. పోక్సో చట్టం కిందకు వస్తాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. చిన్నారులపై లైంగిక వేధింపులను అడ్డుకునే చట్టానికి సంబంధించిన విషయంలో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేయడం కానీ, వీక్షించడం కానీ పోక్సో నేరం కాదు అని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ తీర్పును ఇవ్వడంలో మద్రాసు కోర్టు తీవ్రమైన తప్పు చేసినట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
28 ఏళ్ల ఓ వ్యక్తి చైల్డ్ పోర్న్ వీడియోలను తన మొబైల్లో డౌన్లోడ్ చేసిన కేసులో మద్రాసు హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఆ వ్యక్తిపై నేరాభియోగాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు రిస్టోర్ చేసింది. ఆ వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీం తన ఆదేశంలో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

